Friday, 15 July 2016

When does Dakshinayana starts and what it is

Dakshinayana is the southern transit of the Sun, a human year is equal to one day of gods. 
Dakshinayana is the night of the Devas and Uttarayana is the daytime. The Uttarayana and Dakshinayana period is
calculated differently in South and North India. In North Indian calendars, Dakshinayana   begins on June 21.
In South Indian calendars, it begins on July 16,

In South India, Uttarayana period starts with Makar Sankranti on January 14 or 15 and ends on July 14 or 15. Dakshinayana is from July 14 or 15 to Makar Sankranti.

కాలమును రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతేకాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశినుండి మరొక రాశిలోనికి ప్రతినెల మారుతుంటాడు. ఇలా మారుటనే సంక్రమణం అంటారు. ప్రవేశించిన ప్రతిరాశిలోను సూర్యుడు ఒక మాసముంటాడు. సూర్యుడు కర్కాటకరాశియందు ప్రవేశించినది మొదలు మకరరాశియందు ప్రవేశించు వరకు గల మధ్యకాలము దక్షిణాయనము. దక్షిణాయనమనగా భూమధ్యరేఖకు దక్షిణమున సూర్యుడు సంచరించు కాలము. శ్రావణమాసమునుండి పుష్యమాసము వరకు ఆరు నెలలు ఉండును.
ఏ శుభకార్యాలకైనా ఉత్తరాయనం మిక్కిలి శ్రేష్ఠము. దేవాలయం, తోటలు, బావులు మొదలగు వాని ప్రతిష్ఠలు దక్షిణాయనంలో చేస్తే ఫలితం లభించదు (నిర్ణయసింధువు)
గృహప్రవేశము, దేవతాప్రతిష్ఠ, వివాహము, చౌలము, ఉపనయనం, ఈ శుభకర్మలు ఉత్తరాయణంలో చేయాలి. నిందితమైన కర్మలు దక్షిణాయనంలో చేయాలి (నిర్ణయసింధువు)
దీనికి అపవాదము కాశీ ఖండంలో ఇలా ఉంది:
సదా కృతయుగం చాస్తు సదా చాస్తూత్తరాయనం
సదా మహోదయశ్చాస్తు కాశ్యాం నివసతాం సతాం!! ఇత్యయనం – కాశీఖండం!!
“ఎప్పుడూ కృతయుగం ఉండనీ ఎప్పుడూ ఉత్తరాయనం ఉండనీ, ఎప్పుడూ మోక్షం లభించనీ కాశీలో ఉండే సజ్జనులందరికీ” అని.
https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage/?fref=nf

what is eekadashi in telugu




*నేడు తొలి ఏకాదశి. కాబట్టి దాని విశిష్టత గురించి తెలుసుకుందామా* :-?

🍀మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.

🍀ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.

🍀ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి)నే "శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజునుంచీ శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు.

🍀ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.

🍀తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు

🍀నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.

🍀ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

🍀ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.

🍀ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.

🍀అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.

🍀ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.

🍀తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.🙏







శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం
విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం 
వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం!!
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.
ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు.
ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.
ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.
అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.
ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము.



What is Ekadasi?

There are two Ekadasi days each month and they are astronomically calculated according to the Moon. The word Ekadasi literally means the eleventh day, eka (one) + das (ten) = eleven. So an Ekadasi generally falls eleven days after a full Moon and eleven days after a new Moon. Although there are sometimes exceptions to the rule.

Saturday, 7 May 2016

what is gothram

Science behind Gotra : (Genetics)
What is Gotra system ?
Why do we have this ? Why do we consider this to decide marriages ?
Why should sons carry the gotra of father, why not daughter ?
How does gotra of a daughter changes after she gets married ?
What is the logic ?
Infact this is an amazing genetic science we follow.
Let's see the science of genetics behind gotra systems.
The word GOTRA formed from two sanskrit words GAU (means cow) and Trahi (means shed).
Gotra means cowshed.
Gotra is like cowshed protecting a particular male lineage. We identify our male lineage / gotra by considering to be descendants of the 8 great rishi (sapta rishi + bharadwaj rishi). All the other gotra evolved from these only.
Let's see why human body has 23 pairs of chromosomes (one from father and one from mother) on these 23 pairs, there is one pair called sex chromosomes which decides the gender of person.
During conception if the resultant cell is XX chromosomes then the child will be girl, if it is XY then it is boy.
In XY - X is from mother and Y is from father.
In this Y is unique and it doesn't mix. So in XY, Y will supress the X and son will get Y chromosomes. Y is the only chromosome which gets passed down only between male lineage. (Father to Son and to Grandson).
Women never gets Y. Hence Y plays a crucial role in genetics in identifying the genealogy. Since women never get Y the gotra of a women is said to be of her husband.
They are 8 diff Y chromosomes from 8 rishis. If we are from Same gotra then it means we are from same root ancestor.
Marriages between same gotra will increase the risk of causing genetic disorders as same gotra Y chromosomes cannot have crossover and it will activate the defective cells.
If this continues, it will reduce the size and strength of Y chromosome which is crucial for the creation of male.
If no Y chromosome is present in this world, then it will cause males to become extinct.
So Gotra system is a method to avoid genetic disorders and attempt to protect Y chromosome.

Amazing bio-science by our Maharishis. Our Heritage is unarguably THE GREATEST.

Monday, 2 May 2016

How does god eat prasad

How does god eat prasad   its really a nice explanation in a funny way.


ఇంట్లో, గుడిలో దేవుడి ముందు ఉంచే నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడా ?
 
జ.
 ఒక గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు చదువుకుంటుండేవారు, వారిలో ఒక పిల్లవాడికి ఇదే విధమయిన సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని  ప్రశ్నించాడు .... గురువు పాఠం చెప్పడం పూర్తయిన  తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా... నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది... నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్తితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి  ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం.   

why we go to temple

Here explained what are the reasons or benefits to go temples






what is ugadi and why new year name starts for every Ugadi ?





ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి.

* ఉగాది ప్రసాద శ్లోకం

" శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం "

(ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి)
-------------------------------------------------------------------------------------

తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు...!

 అయితే వాటి వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు.
అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

తెలుగు సంవత్సరాలు, ఆయనములు,ఋతువులు, మాసములు,తిధులు
మన తెలుగు సంవత్సరాల పేర్లు :

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.

సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది....ఆయనములు 2:అవి...

ఉత్తరాయణము :
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటకరాశిలో ప్రవేశించువరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంతబాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.

దక్షిణాయణం :
కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకరరాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.

సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది...అందుకే ఋతువులు ఆరు...
వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర

సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది...అందుకే
మాసములు 12 :
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)

పక్షములు 2 :
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణపక్షం(కృష్ణ అంటే నలుపు అని అర్థం)ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు... శుక్ల పక్షం పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.
ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి.. అవి
పాడ్యమి, విదియ తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి, అమావాస్య
ఇక ఒక పక్షానికి రెండు వారములు.. ఒక వారమునకు ఏడు రోజులు...
ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడానమోదు చేయగలిగినంత... అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..
ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు... మనకు అసలైన నూతన సంవత్సరం.. ఉగాదే.. ఇప్పటినుండే మన వాతావరణంలో మార్పు మొదలవుతుంది... పంచాగం మొదలవుతుంది.. సృష్టి మొదలవుతుంది.. అందుకే ఇది యుగ ఆది అయింది.. అదే ఉగాది అయింది.. ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి పోయిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి..

Wednesday, 20 January 2016

What is kanuma panduga festival

ఈరోజు కనుమ పండుగ!
 జంతువులను పూజించే పండుగ!!

వేదం జంతువులు మనుషులకు సోదర సమానమైనవని అని చెప్పింది. మానవులారా! జంతువులు వధించకూడనవి, వాటిని చంపరాదు అంటుంది యజుర్వేదం. పాశూన్సత్రాయేతం - యజుర్వేదం 6.11 పశువులను/ జంతువులను రక్షించండి అని అర్దం.

ఎద్దు ధర్మస్వరూపం. ఆవు తల్లి.
వ్యవసాయ పనుల్లో నిత్యం రైతుకు సాయం చేసేది ఎద్దు. ఆవులు, గేదెల పాలు అమ్ముకోవడం ద్వారా అవి సాయం అందిస్తున్నాయి. ఆట్లాగే పూర్వాకాలం మన భారతీయ రైతులు గోమూత్రం, గో పేడతో చేసిన సహజ ఎరువులని వాడి పంటలను పండించేవారు. ఇవి భూసారాన్ని చాలా అధికంగా పెంచాయి. అందుకే తెల్లదొరలు భారతదేశం మీదపడి దోచుకునే ముందు వరకు, మనం దేశంలో ఒక్క ఆకలిచావు కూడా లేదు.

ఈ రోజు మనిషి ప్రకృతి నుంచి దూరమయ్యాడు కానీ, రైతులు ఏనాడు పశుసంపదను తమ నుంచి వేరుగా చూడలేదు. వాటిని కుటుంబంలో ఒకరిగా భావిస్తారు. వీడు మా రాముడు, మా శివుడు అంటారు, ఇది మా లక్ష్మీ అంటారు కాని ఇది మా ఎద్దు, ఇది ఆవు అనరు. అవి వారికి జంతువులు కావు.

మరి ఇంత సాయం చేసే వాటిని గౌరవించేందుకు, వాటికంటూ ప్రత్యేకంగా ఒక రోజు (పండుగు) ఉండాలన్న ఆలోచనతో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పండుగే కనుమ. కనుమ సమయానికి పంట చేతికోచ్చి అందరు ఆనందంగా ఉంటారు. పంట బాగా పండడంలో సహాయపడ్డ పశువులకు, రైతులకి ఇప్పుడు కాస్త విశ్రాంతి. అందుకే వాటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగే కనుమ. కనుమ రోజు పశువులను కడిగి వాటిని అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మనకు సాయం చేసే జీవులకు మన కుటుంబంలోనూ, మనసులోనూ స్థానం కల్పించాలి, వాటి పట్ల ప్రేమ, అనురాగం కలిగి ఉండాలన్న గొప్ప సందేశం ఇచ్చే పండుగ కనుమ. ఇది మన పూర్వీకుల గొప్పతనం. మనం కూడా వారిని అనుసరిద్దాం. వారి సందేశాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేద్దాం.

చాలా మంది కనుమ రోజున మాంసం తినాలి అనుకుంటారు. అది తప్పుడు అభిప్రాయం. కనుమ పశువుల ప్రాముఖ్యాన్ని తెలియపరిచే రోజు. ఆ రోజున పశువులను పూజించాలి, కనీసం గుడ్డు కూడా తినకూడదు. కనుమ రోజు తప్పకుండా మినుములు తినాలి. మినుములు చాలా శక్తివంతమైన ఆహారం. అందుకే తెలుగునాట గారెలు, ఆవడలు తినే సంప్రదాయం ఉంది.

what is sankranthi festival

Here I tried to explain what is sankranthi and why and how we celebrate. PLEASE SCROLL DOWN TO READ IN TELUGU

The movement of the sun from one zodiac sign into another is called Sankranti it happens on 14th January as per Calender
and as the Sun moves into the Capricorn zodiacal sign known as Makara in Sanskrit, this occasion is named as Makara Sankranti in the Indian context.

Sankranti marks the termination of winter season and beginning of a new harvest or spring season.

Sun apparently moves month by month throughout the year into these signs and transceiver the energy of those different constellational signs and thereby
transmitting the celestial radiations to our Earth.
Sun travels into these 12 signs of the Zodiac those are Aries, Gemini, Leo, Libra, Sagittarius and Aquarius,
  Taurus, Cancer, Virgo, Scorpio, Capricorn and Pisces.

The earth revolves around sun with a tilt of
23.45 degrees. When the tilt is facing the sun we get summer and when the tilt is away from the sun we get winter. That is the
 reason when there is summer north of the equator, it will be winter south of the equator. Because of this tilt it appears that
 the sun travels north and south of the equator. This motion of the sun going from south to north is called Uttarayana –
 the sun is moving towards north and when it reaches north it starts moving south and it is called Dakshinayana

The six months of Uttarayana are a single day of the Gods; the six months of Dakshinayana are a
single night of the Gods. Thus a year of twelve months is single Nychthemeron of the Gods.

Uttarayana is day time for gods right thats why all doors will be open on this day. Just in case if any one pass away by this day
they directly go to heaven..

Uttarayana is referred to as the day of new good healthy wealthy beginning.

The term Uttarayana is derived from two different Sanskrit words "uttara" (North) and "ayana" (movement) thus indicating a
semantic of the northward movement of the Sun on the celestial sphere. This movement begins to occur a day after the winter
solstice in December which occurs around 22 December and continues for a six-month period through to the summer solstice
around June 21 (dates vary ).


The festival, Sankranti (మకర సంక్రాంతి), is celebrated for four days in Andhra Pradesh and Telangana:

    Day 1 – Bhoghi (భోగి) (Andhra Pradesh, Telangana and Karnataka)
    Day 2 – Makara Sankranti (మకర సంక్రాంతి-పెద్ద పండుగ), the main festival day
    Day 3 – Kanuma (కనుమ) (Andhra Pradesh And Telangana]
    Day 4 — Mukkanuma (Andhra Pradesh And Telangana]

More details
https://en.wikipedia.org/wiki/Makar_Sankranti
en.wikipedia.org
Makar Sankranti is a Hindu festival celebrated in almost all parts of India and Nepal in many cultural forms. It is a harvest festival that falls on the Magh month of ...

How sun moving video







సంక్రాంతి.........!!!

సంక్రాంతి మన దేశంలో జరుపుకునే పెద్ద పండుగ. అందుకే శ్రీనాథ కవిసార్వభౌముడు దీనిని ‘పెను బండువు’ అన్నాడు.సంక్రాంతి అంటే- ‘చేరుట’ అని అర్ధం.సూర్యుడు నెలకోసారి ఒక్కో రాశిలోకి చేరుతుంటాడు. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ మొదటి రాశినుంచి తర్వాత రాశిలో ప్రవేశించడమే ‘సంక్రాంతి’.అయితే, సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి కదా, మరి మకర సంక్రాంతి ప్రాముఖ్యం ఏమిటి? సూర్యుని దివ్య యాత్రల్లో ప్రధాన ఘట్టాలలో మేష, తుల, మకర సంక్రమణలు ముఖ్యమైనవి. సూర్యుడు మకర రాశి చేరగానే ప్రకృతిలో అనేక మార్పులు కలుగుతాయి. ఆ మార్పుల చైతన్యమే ‘మకర సంక్రాంతి’లో కనుపిస్తుంది.

సంవత్సరాన్ని రెండు ఆయనములుగా మనం విభజించుకుంటున్నాం. కటక సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకూ దక్షిణాయనం. మకర సంక్రమణం నుంచి కటక సంక్రమణం వరకూ ఉత్తరాయణం.ఉత్తరాయణము దేవతా పూజకు, దక్షిణాయనము పితృదేవతారాధనకు ప్రధానం. ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి నుంచి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. పాడి పంటలు సమృద్ధిగా ఇళ్ళకు చేరుకుంటాయి. పశుపక్ష్యాదులు ఆనందంగా కనుపిస్తాయి. వాస్తవానికి మన దేశంలో ప్రాకృతిక జీవనం అద్భుతంగా కనుపించేది ఈ పండుగ తరుణంలోనే.
http://whatisfestival.blogspot.co.uk/2016/07/when-does-dakshinayana-starts-and-what.html

సూర్యుడు ధనూరాశి నుంచి మకర రాశికి ప్రవేశించగానే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ పల్లె ప్రజలను ఆనందంగా ఉంచే పండుగ. పిల్లల్ని, పెద్దల్ని, ముఖ్యంగా రైతుల్ని ఆంనందోత్సాహాలలో ముంచే ఈ పండుగ మూడు రోజులు సాగుతుంది.భోగి: మొదటి రోజు భోగి. భోగి మంట వేయడం ఈ రోజు ప్రసిద్ధి.కట్టెల్ని, పిడకల్ని కాల్చి భోగి మంట వేస్తారు. ఈ మంటలో మనలోని అసూయ, ద్వేషాల్ని వేసి, వెలుతురు అనే జ్ఞానాన్ని పొందాలనేది ఇందులో తాత్త్వికాంశం. పాత అలవాట్లు, కామ క్రోధాలను దహనం చేసి కొత్త క్రాంతి పొందాలనే సందేశం ఇందులో కనుపిస్తుంది.

గృహిణులు, యువతులు ఇంటిని, ఇంటి ముందు వాకిలిని శుభ్రపరచి కల్లాపి చల్లి, అందమైన రంగు రంగుల ముగ్గులు వేస్తారు. ఆవు పేడను కింద పడకుండా గ్రహించి, పేడతో గొబ్బెమ్మలు తయారు చేస్తారు. పసుపు, కుంకుమలతో అలంకరించి వాటిపై గరిక, పిండి పూతలతో అలంకరిస్తారు. వాటిని ముగ్గుల మధ్య ఉంచి బంతి, చేమంతి పువ్వులతో, నవ ధాన్యాలతో, రేగు పండ్లతో, చెరకు ముక్కలతో అలంకరిస్తారు. అది అలంకారమో, నైవేద్యమో గుర్తించలేము. యువతులు ముగ్గులు వేయడం ఈ పండుగకు గల మరో ప్రత్యేకత. ముగ్గును ‘రంగవల్లి’ అంటారు.

పితృదేవతలను ఆహ్వానించే కార్యక్రమంలో ముగ్గులు వేయరు. కాని సంక్రాంతి పండుగలో మాత్రం దేవతలకు ఆహ్వానంగా రంగు రంగుల ముగ్గులు వేస్తారు. ఈ సంక్రాంతి ముగ్గులలో తీగ ముగ్గులు, రథం ముగ్గులు, ఇంధ్రధనుస్సు ముగ్గులు, అక్కర జ్యోతి ముగ్గులు, చెరకుగడ ముగ్గులు, మీనాల ముగ్గులు, శుభలగ్నం ముగ్గులు, స్వయంవరం ముగ్గులు దర్శనమిస్తాయి. ఇంటిల్లిపాదీ పిల్లలనుంచి పెద్దల వరకూ వేడి నీళ్ళతో తలారా స్నానం చేసి ‘భోగి పీడ’ వదిలిందని చెబుతారు. సాయంత్రం వేళ పేరంటాలు జరిపి రేగు పళ్ళు, చెరకు ముక్కలతో చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. పొంగలి- పులగము ప్రసాదంగా స్వీకరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నువ్వుల రొట్టెలు తినడం చూస్తాం.

మకర సంక్రాంతి: మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశ్యాధిపతి శని.శని వాత ప్రధాన గ్రహమని జ్యోతిష శాస్త్రం తెలుపుతుంది. వాతం నూనె లాంటి స్నేహ ద్రవ్యాల వల్ల, కూష్మాండం (గుమ్మడికాయ) వంటి కాయల వల్ల తగ్గుతుంది. కాబట్టి ఆ రోజు తెలక పిండి నలుగుతో స్నానం చేసి రాశ్యాధిపతి శని ప్రీతి కోసం నువ్వులు, గ్ముడి కాయలు దానం చేస్తారు. పితృదేవతల పుణ్యలోక ప్రాప్తి కోసం తర్పణ శ్రాద్ధాలను ఆచరిస్తారు.రైతుల..


What is Kanuma festival

http://whatisfestival.blogspot.co.uk/2016/01/what-is-kanuma-panduga-festival.html